9వ తరగతి బాలుడికి పోర్న్ వీడియోలు చూపించి లైంగిక వేధింపులు.. ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు

  • స్కూల్లోనే వేధింపులకు దిగిన ప్రిన్సిపాల్
  • కౌన్సెలర్ వద్దకు వెళ్తే బెదిరింపులు
  • తల్లిదండ్రుల వద్ద విలపించిన బాలుడు
14 ఏళ్ల విద్యార్థికి పోర్న్ వీడియోలు చూపించి లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనను వేధిస్తున్న ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు చేసేందుకు స్కూలు కౌన్సిలర్ వద్దకు వెళ్తే ఈ విషయాన్ని బయట ఎక్కడా చెప్పొద్దంటూ అతడు బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని పూణేలో జరిగిందీ ఘటన.

బాధిత విద్యార్థికి స్కూలు ప్రిన్సిపాల్ బలవంతంగా పోర్న్ వీడియోలు చూపించి, లైంగికంగా వేధించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రిన్సిపాల్ వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు కౌన్సిలర్ వద్దకు వెళ్తే అతడు బాలుడిని భయపెట్టాడని, ఈ విషయం ఎక్కడా చెప్పొద్దని హెచ్చరించాడని పోలీసులు తెలిపారు. దీంతో బాలుడు ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ప్రిన్సిపాల్ తీరుతో భయపడిన బాలుడు ఇకపై ఆ స్కూల్లో చదవబోనని చెబుతున్నాడు. బాలుడి ఫిర్యాదుతో ప్రిన్సిపాల్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Principal
porn
Pune
school
Maharashtra

More Telugu News